‘దండుపాళ్యం 3’ ఆడియో , ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు !
Published on Feb 25, 2018 7:59 pm IST

వెంకట్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్‌ నిర్మించిన దండుపాళ్యం. కన్నడలో విడుదలైన ఈ సినిమా పార్ట్ 1, 2 మంచి విజయం సాధించాయి. ఈరోజు సాయంత్రం ‘దండుపాళ్యం 3’ చిత్ర ఆడియో ను గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు. ఆడియో తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కలిపి చెయ్యడం విశేషం. ‘దండుపాళ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న ‘దండుపాళ్యం 3’ పై పాజిటివ్ బజ్ ఉంది.

తెలుగు , కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తోన్న ఈ సినిమాకు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. మొదటిరెండు పార్ట్శ్ కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందేమో చూడాలి.

 
Like us on Facebook