కొత్త సినిమా గురించి ఆలోచిస్తున్న శర్వానంద్ !

దర్శకుడు శ్రీనివాసరాజు కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన వ్యక్తే. కన్నడలో ఆయన రూపొందించిన ‘దండుపాళ్యం’ సినిమా తెలుగులో కూడా విడుదలై మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడీ దర్శకుడు తెలుగు యంగ్ హీరో శర్వానంద్ తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారట.

ఇటీవలే శర్వాను కలిసిన ఈ దర్శకుడు ఆయనకు ఒక కథ చెప్పారని, శర్వానంద్ కు కూడా ఆ కథ నచ్చిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని వినికిడి. మరిప్పటికే హను రాఘవపూడి, సుధీర్ వర్మలతో సినిమాలకు సైన్ చేసి బిజీగా ఉన్న శర్వా ఈ ప్రాజెక్టుకు ఒప్పుకుంటారో లేదో చూడాలి.