దండుపాళ్యం 3 విడుదల తేది ఖరారు !

16th, December 2017 - 06:00:32 PM

బొమ్మాళి రవిశంకర్‌ పూజ గాంధీ ముఖ్య పాత్రల్లో శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘దండుపాళ్యం’ తెలుగు, కన్నడ భాషల్లో మంచి హిట్ చిత్రంగా నిలిచినా ఈ సినిమాకు సీక్వెల్ గా దండుపాళ్యం2 కొంతకాలం క్రిందట విడుదలై మంచి విజయం సాదించింది. తాజాగా దండుపాళ్యం 3 జనవరి 25 న విడుదల కానుంది.

తాజాగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఈ మూవీ కి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. మొదటి రెండు పార్ట్శ్ కంటే ఈ సినిమా మారిత పెద్ద హిట్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.