యూట్యూబ్‌లో దూసుకుపోతున్న “డేనియల్ శేఖర్”..!

Published on Sep 21, 2021 3:05 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకి చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పవన్ కళ్యాణ్ టీజర్‌కు, టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే తాజాగా నేడు ఈ చిత్రం నుంచి రాణా లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

అయితే నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట? స్టేషన్‌లో టాక్ నడుస్తోంది. నేనెవరో తెలుసా ధర్మేంద్ర హీరో.. హీరో అంటూ రాణా చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు యూట్యూబ్‌లో ఈ టీజర్ ఇప్పటికే 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకి చేరుకుంది. 2022 జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :