మజిలీలో రీమేక్ లో ధనుష్.. రూమర్లే !

Published on Apr 23, 2019 8:08 am IST

నాలుగవ సారి నాగ చైతన్య , సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఈఏడాది సమ్మర్ లో మొదటి సూపర్ హిట్ ను సొంతంచేసుకుంది. ఈ చిత్రం విడుదలై మూడు వారాలవుతున్న ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ వసూళ్లను రాబడుతుంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ నిర్మించింది.

ఇక ఈ చిత్రం కోలీవుడ్ లో రీమేక్ అవుతందని తమిళ స్టార్ హీరో ధనుష్ కు చెందిన వుండర్బర్ ఫిలిమ్స్ ఈ రీమేక్ హక్కులు సొంతం చేసుకుందని వార్తలు వచ్చాయి. దాంతో ధనుష్ ఈ రీమేక్ లో నటించనున్నాడని ప్రచారం జరిగింది. అయితే మజిలీ నిర్మాతల నుండి వస్తున్న సమాచారం ప్రకారం అసలు ఇంకా ఈ చిత్రం యొక్క రీమేక్ రైట్స్ ను ఎవరికి అమ్మలేదంట. దాంతో ధనుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నాడన్న వార్తలు రూమర్లే అని తేలిపోయాయి. మరి ఈచిత్రాన్ని కోలీవుడ్ లో రీమేక్ చేస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :