దర్బార్ కు లీకులు తప్పడం లేదు !

Published on Apr 27, 2019 9:11 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ – ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. ప్రస్తుతం ఈచిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ముంబై లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ కు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్స్ గత కొద్దీ రోజులుగా లీక్ అవుతున్నాయి. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక తాజాగా రజినీ , నయనతార, నివేతా థామస్ ,యోగిబాబు షూటింగ్లో భాగంగా క్రికెట్ ఆడుతున్న పిక్స్ లీక్ అయ్యాయి. ఇవి కూడా వైరల్ అయ్యాయి. మరి ఇకనైనా చిత్రబృందం లీకులు జరుగకుండా జాగ్రత్తపడితే మంచింది. ఇక ఈ క్రికెట్ సీక్వెన్స్ బాగా ఎంటర్టైన్ చేయనున్నాయట. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు.

అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలకానుంది. మొదటి సారి రజినీ- మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచానాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :