డార్లింగ్ విత్ బాలయ్య..హైలైట్ గా చరణ్ కాల్.!

డార్లింగ్ విత్ బాలయ్య..హైలైట్ గా చరణ్ కాల్.!

Published on Dec 30, 2022 8:00 AM IST

మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ లవబుల్ స్టార్ హీరోస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. మరి ప్రభాస్ కల్మషం లేని మనసుకు ఇతర హీరోల అభిమానులు కూడా తనని ఇష్టపడతారు. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ అయితే లేటెస్ట్ గా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న సెన్సేషనల్ టాక్ షో “అన్ స్టాప్పబుల్ 2” కి గెస్ట్ గా వెళ్లగా ఈ క్రేజీ ఎపిసోడ్ మంచి ఆసక్తిగా మారింది.

ఇక ఎట్టకేలకు ఈ ఎపిసోడ్ ని నిన్న ఆహా వారు స్ట్రీమింగ్ కి తీసుకురాగా అందులో భారీ ట్రాఫిక్ దెబ్బకి ఆహా యాప్ క్రాష్ అయ్యిపోయింది. ఇక ఈ మొదటి పార్ట్ ఎపిసోడ్ లోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కాల్ తీసుకోవడం అనేది ఇప్పుడు మంచి హైలైట్ గా నిలిచింది.

ఈ మాటే ఆడియెన్స్ కూడా అంటుండడం విశేషం. ప్రభాస్ చరణ్ తో కాల్ తీసుకోవడం అందులో చరణ్ బాలయ్య మధ్య ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ అలాగే చరణ్ ప్రభాస్ కోసం చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. దీనితో ఈ మొదటి పార్ట్ లో చరణ్ పార్ట్ ప్రభాస్ తర్వాత బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు