థ్రిల్లింగ్ స‌స్పెన్స్ తో వచ్చిన ద‌ర్ప‌ణం ట్రైల‌ర్ !

థ్రిల్లింగ్ స‌స్పెన్స్ తో వచ్చిన ద‌ర్ప‌ణం ట్రైల‌ర్ !

Published on Mar 26, 2019 4:05 AM IST

రామ‌కృష్ణ. వెంప ద‌ర్శ‌క‌త్వంలో త‌నిష్క్‌ రెడ్డి, ఎల‌క్సియ‌స్‌, సుభాంగి ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘ద‌ర్ప‌ణం’ శ్రీ‌నంద ఆర్ట్స్, శ్రీ సిద్ధి వినాయ‌క ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రాంతి కిర‌ణ్ వెల్లంకి, వి.ప్ర‌వీణ్ కుమార్ యాద‌వ్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం రామానాయుడు స్టూడియోస్‌లో చిత్ర ట్రైల‌ర్ ను లాంచ్ చేశారు. విలేక‌రుల స‌మావేశంలో…

ప్రొడ్యూస‌ర్ క్రాంతి మాట్లాడుతూ… ఇది నా మొద‌టి చిత్రం మీరంద‌రి స‌పోర్ట్ ఉండాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రూ బాగా న‌టించారు. టెక్నీషియ‌న్లు కూడా బాగా క‌ష్ట‌ప‌డ్డారు. మీరంద‌రూ త‌ప్ప‌క మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో మాట్లాడుతూ… హీరోగా ఇది నా రెండో చిత్రం స‌క‌ల‌క‌ళావ‌ల్ల‌భుడు త‌ర్వాత నేను న‌టించిన చిత్ర‌మిది. ట్రైల‌ర్ చూశాను చాలా బాగా వ‌చ్చింది. ఇందులో చాలా థ్రిల్లింగ్ స‌స్పెన్స్ అంశాలు ఎక్కువ‌గా ఉంటాయి. నా మొద‌టి సినిమాకి అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. ఈ చిత్రానికి కూడా సపోర్ట్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్ర ట్రైల‌ర్ ను అంద‌రికి షేర్ చేసి కొత్త‌వాళ్ళ‌ను ఎంక‌రేజ్ చెయ్యండి అని అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ అంద‌రూ పాల్గొన్నారు. టెక్నీషియ‌న్స్ః కెమెరామెన్ః స‌తీష్‌ముత్యాల‌, ఎడిట‌ర్ఃస‌త్య‌గిడుతూరి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ఃసిద్దార్ధ్ స‌దాశివుని, ప్రొడ్యూస‌ర్ఃక్రాంతి కిర‌ణ్ వెల్లంకి, వి. ప్ర‌వీణ్‌కుమార్ యాద‌వ్‌, డైరెక్ట‌ర్ః రామ‌కృష్ణ‌. వెంపి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు