ఎన్టీఆర్ సినిమాలో దాసరి !

ఎన్టీఆర్ సినిమాలో దాసరి !

Published on Nov 13, 2018 9:04 AM IST

క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నిర్మాణంలో.. లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో భారీ తారాగణంతో పాటు, కొంతమంది దర్శకులు నటిస్తున్నారు. దర్శకుడు దేవి ప్రసాద్ గుమ్మడిగా, క్రిష్ కేవీ రెడ్డిగా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు ఎన్ శంకర్ కూడా విఠలాచార్యగా, దర్శక రత్న దాసరి నారాయణగారి పాత్రలో దర్శకుడు చంద్ర సిద్ధార్ధ్ కనిపించబోతున్నారు.

కాగా తాజాగా ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం దర్శక రత్న దాసరి నారాయణగారికి సంబంధించిన సీన్స్ ని ఇప్పుడు జరుగుతున్నషెడ్యూల్ లోనే తెరకెక్కించబోతున్నారట. చంద్ర సిద్ధార్ధ్, దాసరి గెటప్ లో అచ్చం దాసరిగారిలానే కనిపించేలా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. బాలీవుడ్ మేకప్ మేన్స్ బయోపిక్ గెటప్స్ కు సంబంధించి ప్రత్యేకంగా పని చేస్తున్నారు.

ఇక ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే పాటలు అన్ని కూడా పూర్తి చేశారని.. అద్భుతంగా వచ్చాయని కీరవాణి కెరీర్ లో మరో సూపర్ హిట్ ఆల్బమ్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు