అదృశ్యమైన దాసరి కుమారుడు తిరిగొచ్చాడు

Published on Jun 19, 2019 10:30 pm IST

ఐదు రోజుల క్రితం దివంగత దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి ప్రభు కనిపించకుండాపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభు మామ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు మొదట్లో ప్రభు చిత్తూరు వెళ్లాడని భావించినా అది నిజం కాదని తెలిసి వెతుకులాట ప్రారంభించారు.

అలా గాలింపు జరుగుతుండగానే ప్రభు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న తన నివాసానికి తిరిగొచ్చారు. ఏ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఎందుకు అదృశ్యమయ్యారు, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయాలపై ఆరాతీస్తున్నారు. దాసరి మరణం తర్వాత కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాలే ప్రభు అదృశ్యం కావడానికి కారణమని పలువరు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More