‘ఫంకీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు డేట్, ప్లేస్ ఫిక్స్..!

Funky

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’ (Funky) విడుదలకు సిద్ధమవుతోంది. అనుదీప్ కేవీ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 11న సాయంత్రం 4 గంటల నుండి ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్ వేదికగా ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను నాగ వంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘ఫంకీ’ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అన్‌లిమిటెడ్ నవ్వులను పంచేందుకు సిద్ధమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version