టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ హిందీ మూవీ ‘జాట్’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా, ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మార్చి 22న సాయంత్రం 5 గంటల నుంచి జైపూర్‌లోని విద్యాధర్ నగర్ స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో రణ్‌దీప్ హుడా విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.