రవన్న ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ

Published on Jan 25, 2021 12:03 pm IST

‘క్రాక్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుని 2021ని విజయవంతంగా ప్రారంభించారు మాస్ మహారాజ రవితేజ. ఈ విజయంతో రవితేజ పూర్వపు ఫామ్లోకి వచ్చారు. ప్రస్తుతం ఈయన ‘ఖిలాడి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం కూడ ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్. రేపు రిపబ్లిక్ డే సందర్బంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. సరిగ్గా 10:08 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానుంది.

‘క్రాక్’ థియేటర్లలో రఫ్ఫాడిస్తుండగానే రవితేజ నుండి ఈ అప్డేట్ రావడం అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది. ‘క్రాక్ ‘ విజయంతో సినిమాపై అంచనాలు కూడ భారీగా పెరిగాయి. అందుకే డైరెక్టర్ రమేష్ వర్మ సినిమాలో మాస్ కంటెంట్ ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నారట. యాక్షన్ ఎపిసోడ్ల మీద మరింత దృష్టి పెట్టారట. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ వేసవికి సినిమాను ప్రేక్షకులకు అందివ్వాలననే యోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :