మొత్తానికి పూరీ, సేతుపతి టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే!

మొత్తానికి పూరీ, సేతుపతి టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే!

Published on Jan 15, 2026 6:57 PM IST

Puri Sethupathi 1

ప్రస్తుతం దక్షిణాది సినిమా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొన్ని క్రేజీ కాంబినేషన్ లలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో చేస్తున్న సినిమా కూడా ఒకటి. మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా నుంచి ఎప్పుడో ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్ ని రివీల్ చేయాల్సి ఉంది. కానీ పలు కారణాలు చేత ఆలస్యం అయ్యింది.

కానీ ఫైనల్ గా ఇప్పుడు అందుకు ముహూర్తం ఫిక్స్ చేసేసారు. ఈ కనుమ కానుకగా రేపు జనవరి 16న ఉదయం లాంచ్ చేస్తున్నట్టు ఓ ప్రీ లుక్ పోస్టర్ తో రివీల్ చేశారు. ఇందులో ఒక కళ్ళజోడు, స్టిక్ ఇంకా సుత్తి ఓ డ్రమ్ దగ్గర కనిపిస్తున్నాయి. సో విజయ్ సేతుపతి ఒక అంధునిగా కనిపిస్తారని కన్ఫర్మ్ అయ్యింది. అలాగే సాలిడ్ యాక్షన్ కూడా ఇందులో ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మాణం వహిస్తుండగా వీరు పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు