‘పెద్ది’ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడంటే!

‘పెద్ది’ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడంటే!

Published on Jun 21, 2026 6:00 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా సినిమానే ‘పెద్ది’. చాలా కాలంగా ఎదురు చూస్తున్న టాలీవుడ్ బిగ్ హిట్ ని ఈ సినిమా అందించింది. అయితే ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో సాలిడ్ రెవెన్యూస్ అందించగా ఈ సక్సెస్ లో భాగంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ మెగా ఈవెంట్ ని ఫిక్స్ చేశారు.

ఈ జూన్ 23 న సాయంత్రం నుంచి హైదరాబాద్ శిల్ప కళా వేదికలో అట్టహాసంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. అక్కడ మేకర్స్ చిత్ర యూనిట్ సినిమా సక్సెస్ కోసం మరిన్ని విషయాలు పంచుకోనున్నారు. ఇక ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు