నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే

నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే

Published on Aug 19, 2026 12:54 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రమే ‘ఇరుముడి’. పలు వరుస పరాజయాలు తనకి ఎదురైనప్పటికీ ఈ సినిమా పట్ల మాత్రం విపరీతమైన పాజిటివ్ హైప్ నెలకొంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా ఎట్టకేలకి థియేటర్స్ లో విడుదలకి వస్తుండగా మేకర్స్ సినిమా తాలూకా నైజాం బుకింగ్స్ ని ఓపెన్ చేశారు.

నైజాం మార్కెట్ లో తెరుచుకున్న బుకింగ్స్ తో ఇరుముడి సినిమా మంచి ఆక్యుపెన్సీ లతో మొదలైంది. ఇక కొన్ని చోట్ల అయితే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రచ్చ చేయడానికి కూడా సిద్ధం అయినట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రానికి నైజాం మార్కెట్ లో ఏ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి. ఇక ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, సాయి కుమార్ తదితరులు నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ లో విడుదల కాబోతుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు