మాస్ మహారాజ రవితేజకి కమర్షియల్ గానే కాకుండా తన కెరీర్ కి బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చిన సినిమా ‘కిక్’. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే పాత్రతో తెరకెక్కిన ‘కిక్’ సీక్వెల్ గా ‘కిక్ 2’ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమా రిలీజ్ కోసం ఓ సెంటిమెంట్ డేట్ ని పరిశీలిస్తున్నారు. అదే మే 7. ఇదే రోజున రవితేజ – సురేందర్ రెడ్డిల కిక్ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. ఇది డేట్ ని ఫస్ట్ పార్ట్ లో ఉండే రవితేజ – ఇలియానాల వారసుడి కథే ఈ సినిమా. ఇదే రోజుకి మరో సెంటిమెంట్ కూడా ఉంది.
కళ్యాణ్ రామ్ హీరోగా సురేందర్ రెడ్డి చేసిన మొదటి సినిమా ‘అతనొక్కడే’ కూడా అదే రోజుల రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. ఇక్కడ మరో యాదృచ్చికం ఏంటంటే కళ్యాణ్ రామ్ కిక్ 2 సినిమాకి నిర్మాత కావడం. దాంతో ఈ చిత్ర టీం అంతా సెంటిమెంట్ గా ఈ సినిమాని మే 7న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
ఈ చిత్ర టీం ఇటీవలే హంపి వెళ్లి అక్కడి లొకేషన్స్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న ఈ సినిమాలో రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


