పవన్ ‘అయ్యప్పణం’ రీస్టార్ట్ కు డేట్ ఫిక్స్.?

Published on Jun 20, 2021 3:06 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ చిత్రం అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. అయితే ఈ చిత్రం షూట్ 40 శాతానికి పైగా షూట్ పూర్తి చేసుకొని కరోనా వల్ల తాత్కాలిక బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఈ బ్యాలన్స్ షూట్ ను మళ్ళీ రీస్టార్ట్ చెయ్యడానికి పవన్ ఎపుడో సిద్ధంగా ఉన్నారని తెలిసింది.

మరి ఎట్టకేలకు ఈ సినిమా షూట్ కు టైం ఫిక్స్ అయ్యినట్టుగా లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. వచ్చే జూలై 11 నుంచి అయ్యప్పణం రీమేక్ షూట్ కానుందట. ఇక ఈ సాలిడ్ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందిస్తుండగా దగ్గుబాటి రానా మరో పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సితార ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :