సుధీర్ బాబు రీసౌండ్ కి డేట్ ఫిక్స్ అయ్యింది.!

Published on Aug 12, 2021 12:25 pm IST


‘వి’ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు దానికి కంప్లీట్ డిఫరెంట్ గా స్టార్ట్ చేసిన లేటెస్ట్ చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన టీజర్ మరియు పాటలతో చాలా మంచి బజ్ నే సంతరించుకుంది. మరి ఇదిలా ఉండగా మేకర్స్ ఈ చిత్రం రిలీజ్ డేట్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఈ ఆసక్తికర చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఆగష్టు 27న రిలీజ్ చేస్తున్నట్టుగా నేడు కన్ఫర్మ్ చేసేసారు.

హీరో రోల్ నుంచి హీరోయిన్ ఆనంది రోల్ వరకు ప్రతి అంశంలో కూడా ఫ్రెష్ డీలింగ్ తో నడుస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ ఇచ్చిన సాంగ్స్ కూడా మంచి ప్లస్ అయ్యాయి. దీనితో ఈ చిత్రంపై టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు రీసౌండ్ ఎంత గట్టిగా ఉండనుందో తెలియాలి అంటే ఈ 27 వరకు ఆగాల్సిందే..

సంబంధిత సమాచారం :