లేటెస్ట్..సూర్య మరో సాలిడ్ సినిమా ఫస్ట్ లుక్ అప్పుడేనా.?

Published on Jul 17, 2021 1:00 pm IST

కోలీవుడ్ స్టార్ హీరోల్లో మన తెలుగు మార్కెట్ లో కూడా మంచి ఆదరణ ఉన్న అతి తక్కువ హీరోల్లో స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. మరి సూర్య హీరోగా ఇప్పుడు పలు ఆసక్తికర చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. వాటిలో వెర్సిటైల్ దర్శకుడు వెట్రిమారన్ తో ప్లాన్ చేసిన చిత్రం “వాడివాసల్” నుంచి ఇంట్రెస్టింగ్ టైటిల్ పోస్టర్ నిన్ననే లాంచ్ చెయ్యగా దానికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే సూర్య నటిస్తున్న వరుస ప్రాజెక్ట్స్ లో తన 40వ చిత్రం పాండిరాజ్ తో ప్లాన్ చేసింది కూడా ఉంది. సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం నుంచి కూడా ఫస్ట్ లుక్ లాంచ్ కి డేట్ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. వచ్చే జూలై 23న సూర్య బర్త్ డే కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చెయ్యనున్నట్టుగా గట్టి టాక్. ఇప్పటికే చాలా మేర షూట్ కంప్లీట్ అయ్యిన ఈ చిత్రాన్ని అక్కడి భారీ చిత్రాల నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :