అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్ – ఒక ప్రేమ కథ’. అనౌన్స్‌మెంట్ నుండే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక కొత్త అప్డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘రుబారూ’ని ఫిబ్రవరి 27న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. డెకాయిట్‌గా మారకముందు అతడి కథ అంటూ ఈ పాటలోని మర్మాన్ని తెలిపారు. ఈ సినిమా ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అని మరియు హీరో పాత్రలో ఉండే మార్పులను సూచిస్తుంది. పెయింటింగ్ స్టైల్‌లో ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రానికి షనీల్ డియో దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అడివి శేష్ తనదైన శైలిలో వైవిధ్యమైన కథాంశంతో వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 27న విడుదలయ్యే మొదటి సాంగ్‌తో సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి.


