ప్రస్తుతం ఒక్క బాలీవుడ్ సినిమానే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా మాట్లాడుకుంటున్న సినిమానే ధురంధర్. దర్శకుడు ఆదిత్య ధర్ అలాగే రణ్వీర్ సింగ్ కాంబినేషన్ లో చేసిన ఈ సినిమా రికార్డు గ్రాసర్ గా సింగిల్ లాంగ్వేజ్ లో నిలిచి చరిత్ర సృష్టించింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ మార్చ్ లో విడుదల చేస్తుండగా ఇప్పుడు ఈ అవైటెడ్ సీక్వెల్ టీజర్ పై లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తుంది. నిజానికి ఈ సినిమా సీక్వెల్ టీజర్ ట్రైలర్ ని పార్ట్ 1 ఎండ్ క్రెడిట్స్ లోనే వేశారు.
కానీ ఆన్లైన్ లో ఇతర సినిమాల థియేటర్స్ లో కనిపించింది లేదు. సో ధురంధర్ 2 టీజర్ కి ఫైనల్ గా డేట్ లాక్ అయినట్టు తెలుస్తుంది. ఈ జనవరి 23న సన్నీ డియోల్ నటించిన అవైటెడ్ సినిమా బోర్డర్ 2 రిలీజ్ అవుతున్న థియేటర్స్ లో అటాచ్ చేయనున్నట్టు తెలుస్తుంది. మరి అది ఆల్రడీ చూసిన టీజర్ ట్రైలరేనా లేక కొత్త కంటెంట్ ఏమన్నా అప్డేట్ చేస్తారా అనేది చూడాలి. అలాగే దీని ఆన్లైన్ రిలీజ్ కూడా ముందు లేదా ఆ తర్వాత రానుంది.


