టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘హనుమాన్’కు సీక్వెల్‌గా రాబోతున్న ‘జై హనుమాన్’ (Jai Hanuman)గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటించనుండటంతో ఈ సినిమాపై హైప్ రెట్టింపు అయ్యింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ గత ఏడాది కాలంగా స్క్రిప్ట్‌పై కసరత్తు చేసి, ఈ పౌరాణిక గాథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు.
ఈ సినిమా గ్రాండ్ లాంచ్ వేడుకకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 22న చారిత్రక నగరమైన హంపిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. హంపి వంటి పుణ్యక్షేత్రంలో సినిమాను ప్రారంభించడం ద్వారా చిత్ర యూనిట్ ఒక పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేయాలని భావిస్తోంది.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల నుండి ప్రారంభం కానుంది. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాతే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యున్నత ప్రమాణాలతో, భారీ బడ్జెట్‌తో ఈ మైథలాజికల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోంది.


