యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రియాలిటీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా, వాటికి ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ముచ్చటగా మూడో పాటను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఈ సినిమా నుంచి సంగీత్ సాంగ్ పాటను మూడో సాంగ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలోని ఈ పాట ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటను నవంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ మూవీలో కిరణ్ అబ్బవరం హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సుధాకర్ చాగంటి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.


