ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ నే ‘డ్రాగన్’. దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేస్తున్న ఈ సినిమా భారీ హైప్ ని సెట్ చేసుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుండగా ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల టాక్సిక్ సినిమాలో అలరించిన ఈ బ్యూటీ తన మొత్తం షూట్ ని ఈ సినిమాకి సంబంధించి పూర్తి చేసుకోబోతుంది అని తెలుస్తుంది.
డ్రాగన్ గ్లింప్స్ లో ఆమె డైలాగ్స్ తోనే మొత్తం హైలైట్ అయ్యింది. ఇక సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఆమె పోర్షన్ సినిమాలో పూర్తవుతుందట. మరి నీల్ ఆమెని ఎలా ప్రెజెంట్ చేసారో చూడాలి. ఇక ఈ చిత్రానికి రవి బాసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


