విష్ణు మంచు ‘కన్నప్ప’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ లాక్.. ఎప్పుడంటే..?

విష్ణు మంచు ‘కన్నప్ప’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ లాక్.. ఎప్పుడంటే..?

Published on Jun 10, 2025 8:00 PM IST

టాలీవుడ్‌లో ప్రెస్టీజియస్ చిత్రంగా తెరకెక్కిన ‘కన్నప్ప’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా భారీ క్యాస్టింగ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రస్తుతం శరవేగంగా మేకర్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రేక్షకలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కన్నప్ప’ థియేట్రికల్ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ను జూన్ 13న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను కూడా వారు రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ వ్యయంతో ప్రొడ్యూస్ చేస్తుండగా జూన్ 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు