మహేష్ ఫేమస్ డైలాగ్ చెప్పిన స్టార్ క్రికెటర్ !

మహేష్ ఫేమస్ డైలాగ్ చెప్పిన స్టార్ క్రికెటర్ !

Published on May 10, 2020 1:36 PM IST

Worner

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వీరబాదుడుకు స్టేడియాలే చిన్నబోయిన సందర్భాలు ఎన్నో. అదే జోష్‌ను టిక్‌ టాక్‌లో కూడా కనబరుస్తున్నాడు వార్నర్‌. ఇటీవలే టిక్ టాక్ లో బుట్టబొమ్మ సాంగ్ కి తన భార్యతో కలిసి డ్యాన్సులు వేసి.. అందరినీ ఆశ్చర్యపరిచిన వార్నర్, ఇప్పుడు డైలాగ్ లతో కూడా ఆకట్టుకుంటున్నాడు.

అదీ మహేష్ బాబు ఫేమస్ డైలాగ్ “నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను”. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్‌ ను, వార్నర్ తన శైలిలో చెప్పిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. పైగా గెస్ ద మూవీ అని నెటిజన్లకు ఛాలెంజ్ కూడా చేశాడు. అయినా తెలుగునాట ఈ డైలాగ్ తెలియని వారు ఎవరు ఉంటారు.

ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు కెప్టెన్‌ గా ఉన్న వార్నర్‌ తెలుగు సినిమాల పై ఇలా ఇంట్రస్ట్ చూపించడం బాగుంది. లాక్ డౌన్ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు ఈ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్. ఇప్పటికే వార్నర్ కత్రినా, అల్లు అర్జున్ సినిమా పాటలతో పాటు ఓ త‌మిళ సాంగ్‌కి సంబంధించిన మ్యూజిక్‌ కి కూడా స్టెప్పులు వేశాడు.

https://www.instagram.com/p/B__4HjQJMLx/?igshid=10qzkbe8zz6mp

తాజా వార్తలు