డియర్ కామ్రేడ్ విడుదల తేది ఫిక్స్ అయ్యిందా ?

Published on Feb 28, 2019 8:33 am IST

గీత గోవిందం తో హిట్ పెయిర్ అనిపించుకున్నసెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , కన్నడ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో రష్మిక క్రికెటర్ పాత్రలో నటిస్తుండగా విజయ్ మెడికల్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు.

ఇక ఈ చిత్రాన్ని మే 22 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :