ధురంధర్ 2 తెలుగు రిలీజ్ ఆలస్యానికి అసలు కారణం ఇదే..!

ధురంధర్ 2 తెలుగు రిలీజ్ ఆలస్యానికి అసలు కారణం ఇదే..!

Published on Mar 19, 2026 5:04 PM IST

Dhurandhar 2

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలై రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా బుక్ మై షో అవర్లీ ట్రెండ్స్‌లో ‘పుష్ప 2’ రికార్డులను సైతం అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే, తెలుగు వెర్షన్ ప్రదర్శనలు నిన్నటి నుంచి రద్దు కావడంతో తెలుగు ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

​మొదట ఈ సినిమా తెలుగు వెర్షన్ నేడు ఉదయం ఆటల నుంచి ప్రదర్శించబడుతుందని భావించినప్పటికీ, అది సాధ్యపడలేదు. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం సెన్సార్ ప్రక్రియ. తెలుగు వెర్షన్‌కు సంబంధించి సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కావడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టడంతో షోలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికేట్ లభించింది, కాబట్టి నేడు సెకండ్ షోల నుంచి లేదా రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2’ ప్రదర్శనలు షురూ కానున్నాయి.

​బాలీవుడ్ యాక్షన్ డ్రామా అయిన ఈ సీక్వెల్ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ మరియు బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే తెలుగు గడ్డపై సందడి చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు