ఆస్కార్ ఎంట్రీ లిస్ట్‌లో ప్లేస్ కొట్టేసిన డియర్ కామ్రేడ్..!

Published on Sep 22, 2019 2:00 am IST

భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ ద్వారా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా డియర్ కామ్రేడ్. అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌ను మూట గట్టుకుంది. అయితే నాలుగు భాషల్లోనూ దారుణంగా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఒక మైనస్‌గా మిగిలిపోయింది.

అయితే తాజాగా ఈ సినిమాకు అనుకోని అదృష్టం వచ్చింది. ఈ సినిమా ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఈ చిత్రంతో పాటు మరో 28 ఇండియన్ సినిమాలు ఈ లిస్ట్‌లో ఎంపికయ్యాయి. అయితే ఈ ఎంట్రీ లిస్ట్‌లో ఏకైక తెలుగు చిత్రంగా డియర్ కామ్రేడ్ ఉండడం విశేషం. అయితే ఈ సినిమాలన్నింటిని స్క్రీనింగ్ చేసి వాటిలో బెస్ట్ చిత్రాన్ని ఎంపిక చేసి దానిని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరిలో ఆస్కార్‌కి పంపుతారు. ఏదేమైనా ఈ సినిమా ఆస్కార్ ఎంట్రీ లిస్ట్‌లోకి ఎంపిక కావడంతో ఈ చిత్ర యూనిట్ సంబరాలు జరుపుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

X
More