నాలుగు బాషల్లో విడుదలకానున్న డియర్ కామ్రేడ్ !

నాలుగు బాషల్లో విడుదలకానున్న డియర్ కామ్రేడ్ !

Published on Mar 8, 2019 8:27 AM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , కన్నడ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఆలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ మార్చి 17న తెలుగు తోపాటు మలయాళ , తమిళ , కన్నడ భాషల్లో విడుదలచేయనున్నారు. ఈచిత్రం తో విజయ్ కన్నడ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఈచిత్రంలో రష్మిక క్రికెటర్ పాత్రలో నటిస్తుండగా విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 22 న విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గీత గోవిందం తరువాత విజయ్ -రష్మిక కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా ఫై మంచి అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు