డియర్ కామ్రేడ్ టీజర్ విడుదలకు టైం ఫిక్స్ !

Published on Mar 16, 2019 5:55 pm IST

గీత గోవిందం తో హిట్ పెయిర్ అనిపించుకున్న విజయ్ దేవరకొండ , రష్మిక మండన్న రెండవ సారి జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను మార్చి 17న ఉదయం 11:11 గంటలకు విడుదలచేయనున్నారు. ఈ టీజర్ తెలుగు తోపాటు మలయాళ , తమిళ , కన్నడ భాషల్లో కూడా విడుదలకానుంది.

భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రంలో రష్మిక క్రికెటర్ పాత్రలో నటిస్తుండగా విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే చివర్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :