తొండంగిలో డియర్ కామ్రేడ్ !

తొండంగిలో డియర్ కామ్రేడ్ !

Published on Nov 5, 2018 5:40 PM IST

Dear

‘గీత గోవిందం’ చిత్రం తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టి , హిట్ పెయిర్ అనిపించుకున్నారు యువ హీరో విజయ్ దేవరకొండ , కన్నడ బ్యూటీ రష్మిక మండన్న. తాజాగా వీరిద్దరూ ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి అనే గ్రామంలో జరుగుతుంది. దాంతో ఊర్లో సందడి నెలకొంది. మరో వారం రోజుల పాటు ఈ చిత్ర షూటింగ్ అక్కడే జరుగనుంది.

యేలేటి చంద్రశేఖర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో రష్మిక క్రికెటర్ పాత్రలో నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది లో ప్రేక్షకులముందుకు రానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు