డియర్ కామ్రేడ్ విడుదల తేది ని మారుస్తారా ?

Published on Mar 27, 2019 12:15 pm IST

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ మే 31న విడుదలకానుందని ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సౌత్ లోని అన్ని భాషల్లో ఈచిత్రం విడుదలకానుంది. అయితే అదే రోజు స్టార్ హీరో సూర్య నటిస్తున్న యెన్ జి కె విడుదలకానుంది. సూర్య కు ఒక్క కన్నడ లో తప్ప తమిళ , తెలుగు ,మలయాళ భాషల్లో మంచి మార్కెట్ వుంది.

దాంతో డియర్ కామ్రేడ్ ను కూడా అదే రోజున విడుదల చేస్తే కలెక్షన్స్ ఫై ప్రభావం పడే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారట. పైగా విజయ్ కూడా సూర్య ఫ్యాన్ అందుకే ఈ చిత్రాన్ని జూన్ 6న విడుదలచేయాలనీ అనుకుంటున్నారట. అయితే ఈ విడుదలతేది ఫై అధికారిక సమాచారం వెలుబడాల్సి వుంది.

భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More