లక్ష్మణ్ టేకుమూడి, రాధికా జోషి, సుప్రియా చవాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ హార్ట్’. జీడీ నరసింహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ తాజాగా విడుదల చేశారు.
వారాహి ఆర్ట్స్ బ్యానర్‌పై బొబ్బాస్ సమర్పణలో రావి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ గురు, పృధ్వీ రాజ్, సత్య ప్రకాష్, జబర్దస్త్ నూకరాజు, జగదీశ్వరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్‌ఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సాయి రాజేష్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రేమ గొప్పతనాన్ని తెలిపే భావోద్వేగపూరిత డైలాగ్‌తో ఈ మోషన్ పోస్టర్‌ను రూపొందించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ టేకుమూడి, అజయ్ యార్లగడ్డ రచన చేయగా, అరవింద్ బి సినిమాటోగ్రఫీ, ఎస్. సుహాస్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీతో పాటు ఇతర వివరాలను అధికారికంగా ప్రకటించనుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


