డియర్ మేఘా…థియేటర్ల లోకి వచ్చేందుకు సిద్ధం!?

Published on Jul 13, 2021 7:13 pm IST

అర్జున్ దాస్యన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్ మేఘా. ఈ చిత్రం లో మేఘా ఆకాష్, అదిత్ అరుణ్ లు హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కన్నడ నాట సూపర్ హిట్ అయిన దియా చిత్రానికి రీమేక్. అయితే ఈ చిత్రం విడుదల కి సిద్దం అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ప్రారంభం కి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ కొత్త సినిమాలు ఇంకా మొదలు కాలేదు. అయితే దీంతో ఈ చిత్రం ఎప్పుడు విడుదల తేదీ ను ప్రకటిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే త్వరలో చిత్ర యూనిట్ సినిమా విడుదల పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం :