డియర్ మేఘకు తక్కువ రన్ టైం కలిసొస్తుందా..!

Published on Sep 1, 2021 2:28 am IST

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ హీరోహీరోయిన్లుగా సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా డియర్ మేఘా సెప్టెంబర్ 3 న విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా చాలా తక్కువ రన్ టైం కలిగి ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ సినిమా కేవలం 2 గంటల 1 నిమిషం మాత్రమే రన్ టైమ్ కలిగి ఉందని, ఎమోషనల్ లవ్ స్టోరీకి ఇంత తక్కువ వ్యవధి రన్ టైమ్ ఉంచడం సరైన నిర్ణయమే అని అంతా భావిస్తున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో ఎలాంటి జిట్ అందుకుంటుందో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :