
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా, మంచు విష్ణు నిర్మాణంలో తెరకెక్కిన ఔట్ అన్డ్ ఔట్ స్పూఫ్ కామెడీ ‘సింగం 123’. మంచు విష్ణు స్వయంగా స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ సినిమా గత శుక్రవారం పెద్ద ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే! విడుదలైన అన్ని చోట్లా మంచి కలెక్షన్లతో ‘సింగం 123’ దూసుకుపోతోంది. సినిమాకు టాక్ కూడా బాగా ఉండడంతో వీకెండ్‌లో కలెక్షన్లు మరింత పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
కొత్త దర్శకుడు అక్షత్ అజయ్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో ‘రేసులో నన్ను అందుకోడానికి నేను రేసుగుర్రాన్ని కాదు.. రెడ్‌బుల్ తాగిన సింహాన్ని రా..’ అంటూ వచ్చే సంపూర్ణేష్ స్టైల్ డైలాగులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్పూఫ్ కామెడీ సన్నివేశాలకు ప్రేక్షకుల వద్దనుండి మంచి ఆదరణ వస్తోందని సినిమా యూనిట్ తెలిపింది. మొదటి వీకెండ్ ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించి స్ట్రాంగ్‌గా నిలబడింది. వీక్ డేస్‌లో కూడా సినిమా నిలబడి మంచి విజయం సాధిస్తుందని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

