తెలుగులో నటించడానికి రెడీ – దీపిక పడుకొనే

తెలుగులో నటించడానికి రెడీ – దీపిక పడుకొనే

Published on Sep 3, 2014 12:15 PM IST

Deepika
మంచి కథతో దర్శకనిర్మాతలు ఎవరైనా నన్ను సంప్రదిస్తే.. తెలుగులో నటించడానికి నేను రెడీ అంటుంది వరుస విజయాలతో హిందీ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన దీపిక పడుకొనే. హిందీ, తెలుగు అని కాదు… మంచి కథ కుదిరితే.. ఇతర భాషలలో కూడా నేను నటించడానికి సిద్దంగా ఉన్నాను అని చెప్పింది. దీపిక నటించిన తాజా హిందీ సినిమా ‘ఫైండింగ్ ఫానీ’. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన ఈ అందాల భామ పైవిధంగా వ్యాఖ్యానించారు.

బెంగుళూరుకు చెందిన దీపిక పడుకొనే… 2006లో ‘ఐశ్వర్య’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మరుసటి ఏడాది కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ ఫర్హా ఖాన్ కంట్లో పడడంతో షారుఖ్ ఖాన్ సరసన ‘ఓం శాంతి ఓం’ సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకుంది. హిందీలో ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇక దీపిక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.

తాజా వార్తలు