సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న దీప్తి సునైనా సరికొత్త పోస్ట్

Published on Jan 10, 2022 12:01 am IST


సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనా, ప్రముఖ యూ ట్యూబర్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌ తో ఇటీవల విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వేదిక గా ఈరోజు ఒక ఎమోషనల్ పోస్ట్ ను చేయడం జరిగింది. ఆ పోస్ట్ లో తన ఫోటో తో పాటుగా సమయం గురించి కొన్ని లైన్స్ ను షేర్ చేయడం జరిగింది.

సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని, జీవితంలో ఒక నిర్దిష్ట క్షణంలో ఆగిపోదని చెప్పింది. తర్వాత ఏం జరుగుతుందో కూడా బయటపెట్టదు అంటూ చెప్పుకొచ్చారు. తన పోస్ట్‌లో సమయాన్ని ప్రస్తావిస్తూ, పరిస్థితులతో సంబంధం లేకుండా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పరోక్షంగా చెప్పింది. దీప్తి యొక్క భావోద్వేగ పోస్ట్ ఆమె ఫాలోవర్స్ ను మరియు శ్రేయోభిలాషుల నుండి భారీ రెస్పాన్స్ కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :