మహర్షి నుండి మీరు చూడని సన్నివేశం…!

Published on Aug 17, 2019 3:00 am IST

దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రిన్స్ మహేష్ హీరోగా చేసిన తాజా చిత్రం మహర్షి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మహర్షి తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా నైజాం లో మహర్షి 30కోట్లకు పైగా షేర్ సాధించి రికార్డు నమోదు చేసింది. కాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మూవీ ఐదు సెంటర్స్ లో వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మహర్షి మూవీలోని ఓ డిలీట్ సన్నివేశాన్ని నేడు విడుదల చేశారు.

బీజీఎమ్ లేకుండా సాగే ఓ సన్నివేశం ఆసక్తికరంగా ఉంది. కాలేజ్ క్యాంపస్ లో మహేష్ కి మరో విద్యార్థికి మధ్య చిన్న సంఘర్షణ, ఇద్దరిని ప్రిన్సిపాల్ మందలించే సన్నివేశానికి సంబందించిన వీడియోని విడుదల చేశారు. మహర్షి మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్ర చేశారు.మహేష్ ప్రస్తుతం చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రం తరువాత మళ్ళీ ఆయన వంశీ పైడిపల్లి చిత్రంలో నటించే యోచనలో ఉన్నారని తెలుస్తుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More