జక్కన్న ట్వీట్‌కి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఏమని బదులిచ్చిందంటే?

Published on Jul 2, 2021 11:21 pm IST


దర్శకధీరుడు రాజమౌళి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా దేశ రాజ‌ధాని ఢిల్లీకి వెళ్లిన రాజమౌళి అక్క‌డ ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం ఫిల్ చేయమని కొన్ని ఫాంస్ ఇచ్చారని, అయితే కనీసం టేబుల్స్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు కింద కూర్చుని, కొందరు గోడలపై ఫాం పెట్టి నింపారని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎగ్జిట్ గేట్ దగ్గ‌ర ఆక‌లితో ఉన్న‌ వీధి కుక్క‌లు గుంపులుగా ద‌ర్శ‌న‌మిచ్చాయని, అయితే విదేశాల నుండి వ‌చ్చిన పాశ్చాత్యుల‌కు ఇలాంటి దృశ్యాల‌తో స్వాగ‌తం ప‌ల‌క‌డం మంచిది కాదని దీనిపై దృష్టి సారించడని ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టాడు.

అయితే జక్కన ట్వీట్‌పై స్పందించిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఇలాంటివి ఎంతగానో తోడ్పడుతాయని చెప్పుకొచ్చింది. ఆర్టీపీసీఆర్ వివరాలకు సంబంధించి నిర్ణీత ప్రదేశాల్లో డెస్కులు ఉన్నాయని, మరికొన్ని ప్రదేశాల్లో కూడా వాటిని ఏర్పాటు చేస్తామని, ప్రయాణికులకు కనిపించేలా బోర్డులు పెడతామని చెప్పుకొచ్చింది. అయితే త్వరగా స్పందించినందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పిన రాజమౌళి ఎగ్జిట్ గేట్ వద్ద కుక్కల సమస్యపై కూడా దృష్టి పెట్టండని మరోసారి గుర్తుచేశాడు.

సంబంధిత సమాచారం :