ఆ సినిమా ట్రైలర్ ను నిషేదించాలంటూ హై కోర్టు లో పిటిషన్ !

ఆ సినిమా ట్రైలర్ ను నిషేదించాలంటూ హై కోర్టు లో పిటిషన్ !

Published on Jan 7, 2019 1:05 PM IST

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ సినిమా ఫై వివాదాలు రేకెత్తించింది. కాంగ్రెస్ పార్టీ కి చెందిన కొందరు లీడర్లు ఈ చిత్రాన్ని విడుదలచేయనివ్వమని హెచ్చరించారు. ఇక తాజాగా ఒక అడుగు ముందుకేసి ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను బ్యాన్ చేయాలని ఢిల్లీ హై కోర్టు లో పిటిషన్ వేశారు. దాన్ని సీరియస్ గా తీసుకొని న్యాయస్థానం ఆ పిటిషన్ ను కొట్టివేసింది. అయితే సినిమా ఫై ఏమైనా అభ్యతరం ఉంటే మన్మోహన్ సింగ్ కు ముందే చూపిస్తామని చిత్ర యూనిట్ ఇంతకుముందు హామీ ఇచ్చింది.

ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని విజయ్ రత్నాకర్ తెరకెక్కించారు. మన్మోహన్ సింగ్ ప్రధాని గా వున్నప్పుడు ఆయనకు అధికార ప్రతినిధిగా పని చేసిన సంజయ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రం ఈనెల 11న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు