మెగాస్టార్ మొదటి ట్వీట్ వచ్చేసింది !

Published on Mar 25, 2020 11:32 am IST

మెగా అభిమానులు ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈ పవిత్రమైన ఉగాది పండుగ రోజున చిరు ట్విట్టర్ లో చేరారు. ఈ ఉదయం 11:11 గంటలకు చిరు ట్విట్టర్‌లో తన మొదటి పోస్ట్ చేసారు. అభిమానులను ఉద్దేశించి తన ప్రేమను తెలిపిన చిరు.. కరోనాను కలిసి కట్టుగా జయిద్దామని తెలిపారు. ఇక మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ ట్విట్టర్ ఎకౌంట్ ను విస్తృతంగా ఫాలో అవుతున్నారు. మెగాస్టార్ ట్విట్టర్ ఐడీని @KCiruTweets అనుసరించవచ్చు. అయితే అందరూ ఊహించినట్లుగా ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ మాత్రం రిలీజ్ కాలేదు.

ఇక ఇప్పటికే చిరు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. మెగాస్టార్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకూ 383 కె కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఇంకా చాల విస్తృతంగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. తన భావాలను ఫ్యాన్స్ తో పంచుకోవటానికి చిరు సోషల్ మీడియాలోకి వస్తోన్నందుకు ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

సంబంధిత సమాచారం :

More