
నూతన దర్శకుడు గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో అలీ సమర్పణలో ఖయూమ్, తనిష్క్ , రాజన్ కీలక పాత్రల్లో నటించిన సినిమా `దేశంలో దొంగలు పడ్డారు. సారా క్రియేషన్స్ పతాకంపై రూపొందింది. రమా గౌతమ్ నిర్మాత. ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ లో చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. “దేశంలొ దొంగలు పడ్డారు ” సినిమా చూశాను. నచ్చింది. దర్శకుడు గౌతమ్ వద్ద టాలెంట్ ఉంది. ఖయ్యూమ్ తో చాలా వైవిధ్యమైన సినిమా చేశాడు. చిరంజీవిగారు ట్రైలర్ లాంఛ్ చేయటం మా సినిమాకు చాలా కలిసి వచ్చింది. ఆయనకు మా ధన్యవాదాలు. అక్టోబర్ 4న ఈ సినిమా చూడండి. నచ్చితే ఈ టీమ్ ను ఆదరించాలని కోరారు.
పృధ్వీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నెగిటివ్ రోల్ చేశాను. నా పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పాను. సినిమా చాలా బాగా వచ్చింది. అక్టోబర్ 4న చూడండి. నచ్చుతుందన్నారు. ఖయ్యుమ్ మాట్లాడుతూ... నేను చాలా సినిమాలు చేశాను. రిలీజ్ కు ముందు నుంచే దేశంలొ దొంగలు పడ్డారు చిత్రానికి పాజిటివ్ బజ్ వచ్చింది. చిరంజీవి గారి వల్ల ,మీడియా వల్ల మా సినిమాకు హైప్ వచ్చింది. టీమ్ అందరం కష్టపడ్డాం. అక్టోబర్ 4న సినిమా చూడండన్నారు.
దర్శకుడు గౌతమ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మీడియా మా సినిమాకు చేసిన ప్రమోషన్ అద్బుతం. అలీ గారి వల్లే ఈ సినిమా అక్టోబర్ 4న రిలీజ్ వరకు వచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సినిమా రియలిస్టిక్ గా చేశామని చెప్పారు.
ఈ సినిమాకి గిరిధర్, జబర్దస్త్ రాఘవ, వినోద్, తడివేలు తదితరులు ఇతర పాత్రధారులు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే.. కెమెరా: శేఖర్ గంగనమోని, సంగీతం: శాండీ, ఎడిటింగ్: మధు.జి.రెడ్డి, కళ: మధు రెబ్బా, సమర్పణ: అలీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయికుమార్ పాలకూరి , సహ నిర్మాతలు: సంతోష్ డొంకాడ, సెలెబ్ కనెక్ట్.

