పవన్ సినిమా గురించి త్వరలోనే చెప్తా – సంపత్ నంది

పవన్ సినిమా గురించి త్వరలోనే చెప్తా – సంపత్ నంది

Published on Oct 31, 2015 4:39 PM IST

Pawan-and-Sampath-Nandi
‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ సంపత్ నంది త్వరలోనే ‘బెంగాల్ టైగర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తమన్నా, రాశీఖన్నా జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ విషయం కాసేపు పక్కన పెడితే రచ్చ సినిమా తర్వాత సంపత్ నంది పవన్ కళ్యాణ్ హీరోగా నటించే గబ్బర్ సింగ్ 2 లైయాస్ సర్దార్ గబ్బర్ సింగ్ కి డైరెక్షన్ చేయాల్సింది.

అందుకోసం దాదాపు రెండేళ్ళ సమయం స్క్రిప్ట్స్ ని రెడీ చేస్తూ వెయిట్ చేసాడు కూడా.. కానీ ఏమైందో తెలియదు గానీ ఆ సినిమా నుంచి పక్కకి వచ్చేసి బెంగాల్ టైగర్ సినిమా చేసాడు. రీసెంట్ గా తిరుమలేశ్వరుని దర్శనం చేసుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారితో నా సినిమా ఉంటుంది. ఆ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేస్తానని చెప్పాడు. ఆ విషయం పవన్ అభిమానులను అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే సంపత్ నంది తదుపరి సినిమా పవన్ తో ఉంటుందా అనే వార్తలు కూడా ఊపందుకుంటున్నాయి.

తాజా వార్తలు