దేవ కట్టా నెక్స్ట్ ఛాయిస్ మెగా హీరో

Published on Jun 23, 2019 9:00 pm IST

‘ప్రస్థానం’ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవ కట్టా ఆ తర్వాత చేసిన ‘ఆటోనగర్ సూర్య, డైనమైట్’ వంటి సినిమాలు పరాజయం చెందడంతో పూర్తిగా కనుమరుగయ్యారు. ఆ తరవాత ఆయన తెలుగులో ప్రాజెక్ట్ ఏదీ చేయలేదు. ప్రస్తుతం ఆయన హిందీలో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ‘ప్రస్థానం’ హిందీ రీమేక్ చేస్తున్నారు. అది పూర్తయ్యాక తెలుగులో సినిమా చేయాలనుకున్న ఆయన మేహా హీరోను చూజ్ చేసుకున్నారు.

అతనే సాయి ధరమ్ తేజ్. దేవ కట్టా చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో తేజ్ వెంటనే అతనితో సినిమాకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. రేపటి నుండి మారుతి డైరెక్షన్లో కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్న తేజ్ అది పూర్తవగానే దేవ కట్టా సినిమాను స్టార్ట్ చేస్తారట. ఈలోపల దేవ కట్టా ‘ప్రస్థానం’ హిందీ రీమేక్ పనుల్ని ముగించుకుని ఫ్రీ అవుతాడట. ఈ చిత్రం కూడా దేవ కట్టా గత చిత్రాల తరహాలోనే స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More