కింగ్ నాగార్జున మరియు న్యాచురల్ స్టార్ నాని కలిసి నటిస్తున్న చిత్రం ‘దేవదాస్’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నాగ్ రౌడీ పాత్రలో నటిస్తుండగా డాక్టర్ పాత్రలో నాని నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంయొక్క ఆడియో విడుదల వేడుక ఈనెల 20న హైదరాబాద్లో ఘనంగా జరుగనుంది. అదే రోజు నాగార్జున నాన్న లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావు గారి జయంతి కావడం విశేషం.
ఇక ఈచిత్రంలో నాగ్ సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా నాని కి జోడిగా రష్మిక నటిస్తుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ రోజు ఈచిత్రంలోని ‘హే బాబు’ అనే లిరికల్ సాంగ్ విడుదలకానుంది. వైజయంతి మూవీస్ పతాకం ఫై చలసాని అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకానుంది.


