దేవదాస్ యూఎస్ కలక్షన్స్ !

దేవదాస్ యూఎస్ కలక్షన్స్ !

Published on Sep 29, 2018 2:49 PM IST

devdassa

శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో సీనియర్ హీరో నాగార్జున , యువ హీరో నాని కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈచిత్రం యూఎస్ లో $386,058 వసూళ్లను రాబట్టిందని సమాచారం. ఇక ఈ చిత్రం ఈ రెండు రోజుల్లో కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకోనుంది. నాగ్ , నాని కు వున్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం 35కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం రాబట్టే వసూళ్ల ఫై చిత్ర విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి .

వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక , ఆకాంక్ష సింగ్ లు కథానాయికలుగా నటించారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈచిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు.

తాజా వార్తలు