మిలియన్ మార్క్ చేరువలో దేవదాస్ !

మిలియన్ మార్క్ చేరువలో దేవదాస్ !

Published on Oct 2, 2018 1:48 AM IST

devdas2
నాగ్ ,నాని కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’ ఇటీవల విడుదలై మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. ఈచిత్రం మొదటి నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ఇక ఈ చిత్రం అటు యూఎస్ లో కూడా మంచి రన్ ను కనబరుస్తుంది. దేవదాస్ అక్కడ $644 ,219 డాలర్ల వసూళ్లను సాధించి వన్ మిలియన్ మార్క్ కు చేరువవుతుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించింది.

ఇక ఈ సినిమా తరువాత నాగ్ ,ధనుష్ దర్శకత్వంలో ఆయనతో కలిసి నటించనున్నాడు. ప్రస్తుతం నాగ్ ఫ్యామిలీ తో కలిసి వొకేషన్ లో వున్నారు. ఇక నాని ‘మళ్ళీరావా ‘దర్శకుడు గౌతమ్ తెరకెక్కించనున్న’ జెర్సీ’ అనే చిత్రంలో నటించాడానికి సిద్దమవుతున్నాడు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రం కావడంతో ఆయన ప్రస్తుతం క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నారు. దసరా రోజు ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.

తాజా వార్తలు